Saturday, March 7, 2026
ads
Homeఆర్టికల్స్ఓ మగువ నీకు వందనం

ఓ మగువ నీకు వందనం

📰 Generate e-Paper Clip

మహిళా అంటే ఒక శక్తి
సృష్టికి మూలం మహిళ
మహిళతోనే మనుగడ
మరువలేము నీ త్యాగం!!

ఆమె సహనానికి మారుపేరు
అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర
మహిళా నీకు శతకోటి వందనాలు
ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!!

ఆమె ఒక అమ్మ ఒక నాన్న
ఆమె పొద్దుతో పోటీ పడుతుంది
కాలంతో పోటీ పడుతుంది ఆమె
ఈ జగతిన సరిలేరు నీకెవ్వరు!!

ప్రేమ త్యాగం సహనం ఆమె
మగువ మనుగడకే ప్రాణం పోసేది
అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం
భూమాతకు ఉండే సహనం ఆమెది!!

అలుపెరుగని ఓర్పు ఆమెది
నిరంతర శ్రమజీవి ఆమె
ఓ మగువా నీకు వందనం
ఆమెతోనే మన జీవన ప్రయాణం!!

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా

రచన:
దేవులపల్లి రమేశ్
కలం: వామిక శ్రీ వర్ష
సిద్దిపేట, నంగునూర్
చరవాణి :9963701294

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular