Saturday, April 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగడి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

గడి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్ర అమూల్యం అని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించి, కేక్ కట్ చేసి, తినుబండారాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, కుటుంబం, సమాజం, విద్య, వైద్యం, విజ్ఞానం వంటి ప్రతి రంగంలో మహిళలు ప్రతిభ కనబరుస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు కేవలం కుటుంబ పరిరక్షకులు మాత్రమే కాకుండా సమాజానికి మార్గదర్శకులు అని, బాలికలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, తమ ప్రతిభతో సమాజంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు,ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్, పూర్ణ చందర్,ధన లక్ష్మి , సుమలత , సరస్వతి, భవాని ,విద్యార్థులు పాల్గొని మహిళా దినోత్సవం ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల సాధికారతతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular