నవగీతం, కరీంనగర్:
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తారక హోటల్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై బిసి మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరల జ్యోతి నరేందర్ , జిల్లా బీసీ మహిళ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవస్థానం సరస్వతి సత్తన్న కు శాలువా తో ఘనంగా సన్మానించారు.. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ మహిళా సంఘం లో పలు సామాజిక సేవ కార్యక్రమాలు , సావిత్రిబాయి పూలే జయంతి రోజున పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ తోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరాల జ్యోతి నరేందర్ నేడు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా , జిల్లా బీసీ మహిళ ఆర్గ నైజర్ సెక్రెటరీ దేవసాని సరస్వతి సత్తన్న నేడు 38 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానించారు.. వారు ఇంక ఉన్నత పదవులతో ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించి మహిళా అభ్యుదయానికి ఆదర్శప్రాయంగా నిలవాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కన్న కృష్ణ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నా రోజు రాకేష్ చారి , యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్ , జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ , బోయిని ప్రశాంత్ , బియ్యని తిరుపతి తోపాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

