నవగీతం, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ మాస్టర్ కాన్వెంట్ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటారని, మహిళా మణులు చాలా సంతోషంగా ఉత్సాహంగా గడపడానికి ఆటల పోటీలు నిర్వహించామని ప్రిన్సిపల్ సాత్పాడి పురుషోత్తం తెలిపారు. వారిని ప్రోత్సహిస్తూ ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా మణులు పాల్గొని సరదాగా ఆటలు ఆడారు ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.


