Monday, March 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఈ- వ్యర్థాలపై అవగాహన

ఈ- వ్యర్థాలపై అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ :

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నాలుగవ రోజు సోమవారం మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిసరాల్లో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఈ- వ్యర్థాలు గురించి గ్రామస్థులకు అవగాహన నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ-వ్యర్థాలు (E-waste) అంటే ఉపయోగం అయిపోయిన, పాడైపోయిన లేదా పాతబడిన ఎలక్ట్రానిక్ వస్తువులనే ‘ఎలక్ట్రానిక్ వ్యర్థాలు’ లేదా  ‘ఈ-వ్యర్థాలు’ అని పిలుస్తారు. ఈ-వ్యర్థాలు సాధారణ చెత్త లాంటివి కావు. వీటిలో సీసం (Lead), పాదరసం (Mercury), కాడ్మియం వంటి అత్యంత విషపూరితమైన లోహాలు ఉంటాయి. వీటిని మట్టిలో పారేయడం వల్ల భూగర్భ జలాలు, నేల కలుషితం అవుతాయి. వీటిని సరిగ్గా రీసైకిల్ చేయకుండా కాల్చడం వల్ల గాలి కలుషితమై మనుషులకు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరియు మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,కార్యదర్శి గూరుడు శ్రీనివాస్,ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్ అరికుప్పల రాజం, శనిగారపు నరేష్,భుక్యా శేఖర్, కదుర్క లక్ష్మి, ఏనుగు లక్ష్మి-వెంకట్ రెడ్డి,కాషవత్తుల లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES
    - Advertisment -ads

    Most Popular