నవగీతం, మెట్ పల్లి టౌన్:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,అరోరా జూనియర్ కళాశాల, నరేంద్ర జూనియర్ కళాశాలలతో పాటు ఇబ్రహీంపట్నం,మల్లాపూర్ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో మంగళవారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సమక్షంలో అడ్మిషన్ల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన కరపత్రాలను ఆయా కళాశాల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ టీ.దేవన్న మాట్లాడుతూ.. మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరూ విధిగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం,స్కాలర్షిప్ సదుపాయం, పోటీ పరీక్షలకు సిద్ధం చేయటానికి” శిక్షణ” వంటి అన్ని అంశాలలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాలను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవన్న విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆ యా పరీక్షా కేంద్రాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బిల్ల రాజేందర్, ఏ.మనోజ్ కుమార్, అంజయ్య, శ్రీకాంత్, సత్యశోధన్ , దశరధం లతో పాటు బోధనేతర సిబ్బంది లక్ష్మి నారాయణ, బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


