నవగీతం, మల్లాపూర్:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగం గా ఐదవ రోజు మంగళవారం మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం పరిసరాల్లో రోడ్డు శుభ్రంగా ఊడ్చి చెత్త తీసివేసి డ్రైనేజీ లను శుభ్రం చేసారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రైనేజీలో చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదని మీ ఇంటి దగ్గరికి వాహనం వచ్చేటప్పుడు ఆ వాహనంలో చెత్తను వేసి మన వీధులను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, శనిగారపు లావణ్య, కదుర్క లక్ష్మి, ఏనుగు లక్ష్మి-వెంకట్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు రాధ, వసంత, గంగా భవాని, ఇందిర,ఆశా కార్యకర్తలు సరిత, రమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

