నవగీతం,జగిత్యాల:
మోతే ఏకలవ్య ఎరుకల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా దాసరి పోచయ్య (ఎల్ ఐ సి), ప్రధాన కార్యదర్శిగా మొగిలి గంగాధర్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించగా ఓటింగ్ లో శ్రీరామ్ రాజయ్య ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా తెనుగు ఎల్లయ్య, కోశాధికారిగా లోకిని చంద్రమౌళి, సహాయ కోశాదిరిగా దాసరి మీనయ్య, గౌరవ అధ్యక్షులుగా శ్రీరామ్ భగవంతం, సుంతన్ పోచయ్య, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మికాంతం, వెంకటేశ్ , ఎల్లయ్య (పోస్ట్), కిషన్, శ్రీనివాస్, చిన్నారాజం, రాజేశం, ఎల్లయ్య (పోచయ్య) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులు నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపి శాలువలతో సన్మానించి సత్కరించారు.

