నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపాల్‌గా పి. గోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు నూతన ప్రిన్సిపాల్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపాల్ పి. గోపాల్, కొడిమ్యాల మండల ప్రజలు, స్థానిక నాయకులు, అధ్యాపకుల సహకారంతో కళాశాల సమగ్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల విద్య అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ బాధ్యులు ఆంజనేయరావు, మహేంద్ర కుమార్, సత్యనారాయణ, శశిధర్ శర్మ, శివరామకృష్ణ, జగిత్యాల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. వేణు, కళాశాల అధ్యాపకులు జయపాల్, ప్రమోద్, బాలకృష్ణ, జయశీల, అనిల్ కుమార్, తిరుపతి, నర్సయ్య, సుమన్, భాస్కర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

