Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం

వైభవంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణం

📰 Generate e-Paper Clip

దేవస్థానం కామాన్ కి భూమి పూజ చేసిన డాక్టర్ రేగొండ రాజేశ్, జువ్వాడి కృష్ణారావు

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విడిసి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజికవేత్త కోరుట్ల విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని దేవస్థానం వద్ద కమాన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రేగొండ రాజేష్ మాట్లాడుతూ… కమాన్ కు అయ్యే ఖర్చు విజయ హాస్పిటల్ తరఫున నిర్మిస్తాం అని తెలియజేశారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గుట్ట పైన మిగిలిన సీసీ రోడ్డు పనిని తొందర్లోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. మల్లాపూర్ ఎస్ఐ అనిల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందున భద్రత, వాహనాల పార్కింగ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, వివిధ గ్రామాల సర్పంచ్లకు, వివిధ పార్టీల నాయకులకు, పాత్రికేయులను ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, సర్పంచ్ పద్మ నరసయ్య సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు జక్కుల రాజేందర్, పాల్తపు రాజారెడ్డి, మారు శేఖర్, నేముళ్ల ప్రశాంత్, రెబ్బాస్ నర్సయ్య, అంతడుపుల గంగాధర్, తునికి రంజిత్, మినుముల రమేష్, సౌకాని శ్రీను, వడ్డే రెడ్డి, అండెం నరసయ్య, కొత్తపల్లి నవీన్, గున్నాల గంగరాజం ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్ సంతోష్ యాదవ్, లక్ష్మారెడ్డి, దేవయ్య, నరేష్, కొమురయ్య, రాజా తిరుపతి, కిరణ్, అంజయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎలల జలపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీను, ఎఏంసి డైరెక్టర్ నూతిపెళ్లి రాజం, గొర్రె పెళ్లి సర్పంచ్ వెంకటరెడ్డి, కొత్తధామ్రాజుపల్లి, సర్పంచ్ లింబాద్రి, రొండ్ల రాజారెడ్డి, కిరణ్, పెంట శ్రీను, మల్లాపూర్ ఉప సర్పంచ్ సోమరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవీందర్, సోమయ్య, శ్రీను, లక్ష్మణ్, రమేష్, అశోక్, చింటూ, విజయ్, రాకేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular