నవగీతం, హైదరాబాద్:
హైదరాబాద్ ఎల్బీనగర్ కేబీఆర్ కన్వెన్షన్ లో జరిగిన పద్మశాలి ఉగాది పురస్కారాల సేవా అవార్డును కరీంనగర్ కు చెందిన ఎలిగేటి శ్రీనివాస్ కు ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ అందజేశారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ చేనేత ఐక్యత వేదిక, రాష్ట్ర పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహించిన పద్మశాలి టెక్స్టైల్ ఎక్స్పో 2006 ఉగాది పురస్కారాల అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలు సేవా రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్ర స్థాయి అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎలిగేటి శ్రీనివాస్ మాట్లాడుతూ…ఈ అవార్డు రావడానికి కృషి చేసిన చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాకటి రాజ్ కుమార్, ఇప్పనప్పలి రమేష్, మార్తా రమేష్, గంగా మల్లేశం, సిరిసిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

