Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా !

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా !

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు.రాజీనామా విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు చివరి వరకు బుజ్జగించారు. అయినా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనా మా లేఖను ఏఐసీసీ మరియు పీసీసీ కార్యాలయాలకు పంపారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు సంతోషం లేకుండా చేశారు. గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం కంటే తప్పుకోవడమే మేలని భావించినట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి, తదుపరి ఏ పార్టీలో చేరబోతున్నారు? లేదా స్వతంత్రంగా ముందుకు సాగుతారా? అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగిత్యాల నియోజకవర్గంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular