ఎస్సై పిలుపు మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్
నవగీతం, మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుముల వెంకటేష్ మల్లాపూర్ పోలీసు శాఖ పిలుపు మేరకు వివిరావుపేట్ హై స్కూల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు అనంతరం ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగిస్తూ మెరుగైన సమాజం కోసం పాటుపడాలని నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగం అని సిసి కెమెరాల ద్వారా నేరస్తులను తొందరగా గుర్తించవచ్చని అన్నారు.ఈ సందర్బంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం నిర్వహించి విద్యార్థులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల, మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో వెంకట్రావు పేట సర్పంచ్ కనుముల వెంకటేష్, వేంపల్లి సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, పాఠశాల చైర్మన్ జారిన, ప్రధాన ఉపాధ్యాయులు దత్తత్రి, కార్యదర్శి వేల్పుల సురేష్ ఉపసర్పంచ్ లు తోట గంగారెడ్డి రొడ్డ హారిక రాజు,మాజీ సర్పంచ్ ఆనంద్ గౌడ్ వార్డ్ సభ్యులు జక్కని మల్లేష్, బాలసాని రాములు, అంకుష్, తదితరులు పాల్గొన్నారు.


