నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏలేటి రామ్ రెడ్డి విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు జిల్లా వెంకటేశ్వర్లు, ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, పుప్పాల భానుమూర్తి లు తెలిపారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ లో మొత్తం 159 ఓట్లు ఉండగా, సోమవారం జరిగిన ఎన్నికల్లో 153 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష బరిలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా ఏలేటిరామ్ రెడ్డి 55 ఓట్లు సాధించి, లింబాద్రి పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. అలాల సత్యనారాయణ 44 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అలాగే జాయింట్ సెక్రటరీ విభాగంలో కూడా మగ్గిడి నర్సయ్య కూడా ఉడుత ప్రశాంత్ మహర్షి పై ఒక్క ఓటు తేడాతోనే గెలిపొందారు. జూనియర్ ఈసి విభాగంలో తలారి రాజశేఖర్, నత్తి రాజశేఖర్, ద్యావని సత్యనారాయణలు టాప్ 3 లో విజేతలుగా నిలిచారు. ఉపాధ్యక్షురాలిగా మెడిచెల్మెల సుమలత, జనరల్ సెక్రటరీ గా నల్లా రాజేందర్, కోశాధికారీగా బిగుల్లా శంకర్, లైబ్రరీ సెక్రటరీ గా ఆకుల మానస, కల్చరల్ సెక్రటరీ గా కాజీపేట స్రవంతి, స్పోర్ట్స్ సెక్రటరీ గా నీరటి రమణ, సీనియర్ ఈసి మెంబెర్స్ గా పోలకొండ దయాకర్ వర్మ, బోడ లక్ష్మణ్, అబ్దుల్ హఫీజ్ లు ఏకగ్రీవంగా గెలిచారు. అనంతరం విజయం సాధించిన కార్యవర్గాన్ని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ లు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

