Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలడ్రైనేజీ లు శుభ్రం చేసిన సామాజిక కార్యకర్త ఏ వి ఆర్

డ్రైనేజీ లు శుభ్రం చేసిన సామాజిక కార్యకర్త ఏ వి ఆర్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఏనుగు వెంకట రెడ్డి అనే సామాజిక కార్యకర్త గత రెండు రోజులుగా మల్లాపూర్ లోని 14 వ వార్డు పరిసరాల్లో డ్రైనేజీ లు శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్బంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా చేసి చెత్త కుండీలలో పారావేయాలని, ఎండల తీవ్రత ఎక్కువ అవుతున్న సమయం లో అత్యవసరమయితే తప్ప ఇళ్లలోనుండి బయటకు ప్రజలు రావొద్దు అని కోరారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తల పైన హెల్మెట్ లేదా టోపీలు ధరించాలని,శీతల పానియాలు తాగకూడదు అని,నిమ్మరసం తాగాలని సూచించారు.ఇతని సేవలని పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular