Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబస్టాండ్ సమీపంలో రోడ్డుపై త్రాగునీరు వృధా

బస్టాండ్ సమీపంలో రోడ్డుపై త్రాగునీరు వృధా

📰 Generate e-Paper Clip

ప్రయాణికులకు ఇబ్బందులు- పట్టించుకోని అధికారులు

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న తాగునీటి సరఫరా గేట్ వాల్వ్ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపైకి పారిపోతూ బురదమయంగా మారింది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో, మరోవైపు తాగునీరు వృథాగా. అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది.బస్టాండ్ ముందు ఉన్న కిరాణా దుకాణం సమీపంలోని మంచినీరు సరఫరా చేసే గేట్ వాల్వ్ నుంచి నీరు కారిపోవడంతో రహదారి మొత్తం చిన్నపాటి చెరువులా మారింది.బస్టాండ్ వద్ద బస్సుల నుంచి దిగే ప్రయాణికులు తమ లగేజీతో నీటిలోనే బస్సు దిగి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.వివిధ గ్రామాలకు వెళ్లే బాటసారులు కూడా ఈ మార్గంలో నడవడం కష్టసాధ్యంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మంచినీటి లీకేజీని వెంటనే మరమ్మతు చేసి, తాగునీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular