Thursday, April 16, 2026
ads
Homeకరీంనగర్దేశంలోనే మొదటి స్థానంలో కోనేరుపల్లె గ్రామం

దేశంలోనే మొదటి స్థానంలో కోనేరుపల్లె గ్రామం

📰 Generate e-Paper Clip

నవగీతం,చొప్పదండి ప్రతినిధి:

చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. భారత గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి, దేశంలోని 1.5 లక్షలకు పైగా ఉన్న గ్రామ సర్పంచులను అనుసంధానిస్తూ ఒకే వేదికపైకి తెచ్చే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా మార్చి నెలలో భారత ప్రభుత్వం ఇచ్చిన “క్రీడా మిత్ర పంచాయతీ ” ప్రణాళికలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామంలోని యువతని క్రీడలవైపు మళ్ళించే విధంగా కృషిచేసి వారితో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించి రూపొందించిన వీడియోకు గాను కోనేరుపల్లె సర్పంచ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 35 వేల రూపాయల బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా క్రీడా అభిమానులు ప్రజాప్రతినిధులు సర్పంచును అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular