Thursday, August 6, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

శుభాకాంక్షలు తెలిపిన అడువాల జ్యోతి లక్ష్మణ్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సంగనభట్ల దినేష్‌కు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొని దినేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి మాట్లాడుతూ.. దినేష్ నాయకత్వంలో జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రంథాలయాలు సమాజానికి జ్ఞాన నిలయాలుగా నిలవాలని, విద్యార్థులు, యువతకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ లైబ్రరీలు, ఈ-రిసోర్సులు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ప్రత్యేక పుస్తకాలు, మార్గదర్శక సదస్సులు ఏర్పాటు చేస్తూ, వినూత్న కార్యక్రమాలతో జగిత్యాల జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular