Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల4వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతికి సన్మానం

4వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతికి సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్లప్రతినిధి:

అణగారిన వర్గాల విముక్తి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాల పాటు సాయుధ పోరాట బాటలో నడిచిన మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి (దేవన్న)ని కోరుట్ల పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ బృందం శనివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ బృందం మాట్లాడుతూ, కేవలం వార్తా పత్రికల్లో మాత్రమే చూసే ఒక గొప్ప విప్లవ యోధుడిని ప్రత్యక్షంగా కలుస్తామని కలలో కూడా ఊహించలేదని, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక నిబద్ధత గల నాయకుడితో సంభాషించడం తమకు లభించిన గొప్ప గౌరవంగా, అద్భుత ఘట్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల తిరుపతి గారికి ఉన్న నిబద్ధత, ఆయన స్ఫూర్తిదాయక మాటలు తమకు ప్రజా సేవలో మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని కౌన్సిలర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular