నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేశాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కొండ నర్సాగౌడ్ కుమార్తె రుచిత-శ్రావణ్ గౌడ్ ల వివాహం సందర్భంగా నూతన వధూవరులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆశీర్వదించారు. కేశాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట నాయకులు కొండ మురళి గౌడ్, సీహెచ్ సత్యనారాయణ గౌడ్, రేండ్ల రాజన్న, నల్ల వెంకటేష్, వాల్గోట్ నరేష్ తదితరులున్నారు.

