Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివి

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివి

📰 Generate e-Paper Clip

ధర్మపురి తలాపున గోదావరి ఉన్న తాగునీటి ఇవ్వలేని అసమర్ధ నేత కొప్పుల

మీడియా సమావేశంలో మాజీ మంత్రిపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు.

నవగీతం,జగిత్యాల/ధర్మపురి:

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన ఆరోపణలు అర్థం లేనివని, ధర్మపురి పట్టణానికి తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రజలకు తాగునీటిని అందించలేని అసమర్ధ నేతగా కొప్పుల ఈశ్వర్ పేరు తెచ్చుకున్నారని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన ఆరోపణపై ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, గొల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నియోజకవర్గంలో ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన పదేళ్ల పాటు ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. ధర్మపురి పట్టణానికి తాలాపున గోదావరి నది ఉన్న ధర్మపురి ప్రజలకు బుక్కెడు తాగు నీటిని అందించలేని అసమర్ధ నేతగా కొప్పుల ఈశ్వర్ పేరు తెచ్చుకున్నారని వారు అన్నారు.    వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ధర్మపురి సంస్కృతాంధ్ర కళాశాల మూతపడిన కొప్పుల ఈశ్వర్ పట్టించుకోక పోవడంతో 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల లోపు ధర్మపురిలోని కళాశాల పునరుద్ధరణకు మంత్రి లక్ష్మణ్ కుమార్  కృషి చేశారని గుర్తు చేశారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇటీవల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. టీయూఎఫ్ఐడి ద్వారా రూ. 15 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన అమృత్ పథకంలో రూ. 22 కోట్లతో ధర్మపురిలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి రూ. 2 కోట్లతో బోర్ వెల్స్ తవ్వించడం జరిగిందని అన్నారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 25 లక్షలతో పనులు చేపట్టామని, ధర్మపురి పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి 2026-27 విద్యా సంవత్సరం లో తరగతులు ప్రారంభించుకోవడానికి సిద్ధమవుతున్నామని అన్నారు.     పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రత్యేక చోరవతో ధర్మపురి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు వివరించారు. నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి రూ.4.60 కోట్లతో 11 కేవీ లైన్ సమస్యకు మంత్రి పరిష్కారం చూపించారని వారు అన్నారు.       ప్రతి కుల సంఘానికి భవనాలు ఉండాలని రూ. రెండు కోట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నిధులు కేటాయించారని, ధర్మపురి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పవిత్ర గోదావరి నది కలుషితం కాకుండా ఉండాలని భావించిన మంత్రి ప్రభుత్వాన్ని ఒప్పించి సీవరేజ్ ప్లాంట్ నిర్మాణానికి రూ.7 కోట్లు కేటాయించారని, నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా 3500 ఇళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు వారు గుర్తు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేయడంలో కొప్పుల ఈశ్వర్ విఫలం కావడంతోనే మార్పు కోరిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలు 2023లో జరిగిన ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని గెలిపించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్  కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు.              మంత్రి అడ్లూరి పనితీరుకు నిదర్శనం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు 70% స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి పట్టణంలో 15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.       మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీ ధర్మపురిలో ఉనికి కోల్పొతుందని మంత్రి అడ్లూరి పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ 10 ఏళ్ల పరిపాలన అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రెండేళ్ల పరిపాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. సమావేశంలో నాగారం సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, ధర్మపురి మండల పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, పట్టణ అధ్యక్షులు చీపురిశెట్టి రాజేష్, వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, సుముఖ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular