Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి:కలెక్టర్  సత్య ప్రసాద్

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి:కలెక్టర్  సత్య ప్రసాద్

📰 Generate e-Paper Clip

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలను సోమవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… ప్రజల రక్షణకు, నేరాల అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు. ప్రతి వీధి, ప్రతి మూలలో కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే గుర్తించడం, నిందితులను పట్టుకోవడం చాలా వేగంగా జరుగుతోంది. సీసీ కెమెరాలు లేకపోతే కేసుల ఛేదనలో ఆలస్యం జరిగేది, కానీ ఇప్పుడు వాటి సహాయంతో విచారణ వేగవంతమైంది అని తెలిపారు.దొంగతనాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనల్లో నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పోలీసులు తక్షణమే స్పందించి అరెస్టులు చేయగలిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయని వివరించారు.

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ… “సీసీ కెమెరాలు పోలీసుల మూడో నేత్రం లాంటివి. ఇవి నేరాలు జరగకుండా ముందుగానే హెచ్చరికగా పనిచేస్తాయి. కెమెరాలు ఉన్నాయన్న భయం నేరస్థుల్లో ఉంటుంది అని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లకు, వ్యాపార సంస్థలకు, అపార్ట్‌మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని తెలిపారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక కళాశాలలు, పాఠశాల యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు ఇతర సంస్థల ప్రతినిధులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజల సహకారం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావడం కష్టమని, ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘు చందర్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, ఎస్‌.ఐ లు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular