Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలట్రాఫిక్ నియమాలను పాటించి ప్రాణాలు కాపాడుకోండి: డిప్యూటీ డీఎంహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాస్

ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రాణాలు కాపాడుకోండి: డిప్యూటీ డీఎంహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిశితంగా పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ డీఎంహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కొరుట్లలో నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తేనే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular