Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: "అరైవ్ అలైవ్" నినాదంతో చైతన్యం

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు: “అరైవ్ అలైవ్” నినాదంతో చైతన్యం

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి :

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.” అరైవ్ అలైవ్ ” అనే నినాదంతో నిర్వహించిన సమావేశంలో ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ప్రాణ రక్షణ కోసం పాటించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ ప్రసంగిస్తూ, సమాజానికి వెన్నెముక వంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడటం దురదృష్టకరమని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపరాదని. ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యువత, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ పాలకవర్గం వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular