Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం :సిఐ అనిల్

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం..రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం :సిఐ అనిల్

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి రూరల్:

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెల్లుల గ్రామంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం,ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతభావం పెంపొందించడం లక్ష్యంగా ఆరైవ్ ఏ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం,మద్యం సేవించి వాహనం నడపడం,డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం,ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటి అంశాలేనని అన్నారు.ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వాహనం నడిపి ,తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు.చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని,అలాంటి సంఘటనలు కుటుంబాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, సి ఐ అనిల్,ఎస్ ఐ కిరణ్ కుమార్ గౌడ్,ఎస్ ఐ గంగాధర్,కార్యదర్శి నారాయణ, మెడికల్ ఆఫీసర్ అజిత్ రెడ్డి,ఆర్. ఐ కాంతయ్య, ఉప సర్పంచ్ రాజశేఖర్, వార్డు మెంబర్ రాజా రెడ్డి, భూమేష్, రాజు,అంగన్వాడీ టీచర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular