బంటు పేట మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
పాల్గొన్న జనసేన నాయకులు
నవగీతం మెట్ పల్లి ప్రతినిధి:
మెట్ పల్లి పట్టణం 14వ వార్డు బంటు పేట కాలనీ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు బంటు పేట మాల సంఘ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుపేట సంఘ సభ్యులు, పలువురు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి, అదేవిధంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జై భీమ్ అని నినాదాలు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్న 14వ వార్డు జన సేన నాయకులు పర్రె సంతోష్ కుమార్, పట్టణ జనసేన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జీవితం పలువురికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందని, ఆయన జీవిత చరిత్ర చదవడం వల్ల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలను అధిగమించే ప్రేరణ కలుగుతుందన్నారు. అంబేద్కర్ బాటలో విద్యార్థులు, యువకులు పరిస్థితులను తట్టుకొని ఉన్నత ఆలోచనలతో విజయం సాధించాలన్నారు. జనసేన సీనియర్ నాయకులు ఎలగందుల అజయ్, అబ్బూరి ఆనంద్ గౌడ్, బాసెట్టి రాంప్రసాద్, కడారి శ్రీకాంత్, దివిటీ బాలకిషన్, జైపాల్, దివిటీ రవి లు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బహుజనులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించి ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆయన ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు యువకులు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బంటు పేట సంఘ నాయకులు బిట్లుగు కార్తీక్, కారం నరేష్, కంబ సురేష్, కంబ అశోక్, బొల్లుమల్ల సుమన్, బొల్లుమల్ల కిరణ్, కారం అనిల్, గుమ్మడి విక్రమ్, రవి, గోరుమంతుల నవీన్, బక్కూరి రమేష్, రాజశేఖర్, లక్ష్మీరాజం, సంతోష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


