నవగీతం,యాదగిరిగుట్ట:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో స్వామి వారిని రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, సమాజంలో ఐక్యత, సమానత్వం పెరగాలని మనసారా కోరుకున్నారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సమాజంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందాలని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజల సేవలో మరింత కృషి చేస్తాను” అని అన్నారు.దర్శనం అనంతరం దేవాలయ అధికారులు మల్లన్న కి శ్రీఫలం, ప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

