నవగీతం,ధర్మపురి:
ధర్మపురి లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అనంతసాగర్ లోని శ్రీ సరస్వతి అమ్మవారి క్షేత్రం ఆధ్వర్యంలో ప్రతి యేటా సరస్వతి యజ్ఞం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 518 వ సరస్వతి యజ్ఞాన్ని ధర్మపురిలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సరస్వతి యజ్ఞం నిర్వహిస్తున్నారు. ధర్మపురిలో నిర్వహించే సరస్వతి యజ్ఞానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ తో పాటు ధర్మపురి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.

