Thursday, August 6, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆడెల్లి పోచమ్మ చెంత కోరుట్ల బజరంగ్ దళ్ నేతల మొక్కులు

ఆడెల్లి పోచమ్మ చెంత కోరుట్ల బజరంగ్ దళ్ నేతల మొక్కులు

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణానికి చెందిన బజరంగ్ దళ్ నాయకులు ఆదివారం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆడెల్లి పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా, అమ్మవారికి యాట పిల్లతో (పొట్టేలు) మొక్కును ఘనంగా చెల్లించుకున్నారు. గత కొంతకాలంగా తాము అనుకున్న పనులు విజయవంతం కావాలని కోరుకున్న నాయకులు, ఆదివారం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం యాటను బలి ఇచ్చి, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ.. ఆడెల్లి పోచమ్మ తల్లి అత్యంత శక్తివంతురాలని, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని కొనియాడారు. హిందూ ధర్మ రక్షణలో తాము సాగిస్తున్న పోరాటాలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు, తోటి కార్యకర్తలకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular