Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొరుట్ల ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

కొరుట్ల ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

📰 Generate e-Paper Clip

కొరుట్ల, అక్టోబర్6,(నవగీతం) 

జగిత్యాల జిల్లా కోరుట్లలోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలాన్లు, పెండింగ్ దరఖాస్తులు,కార్యాలయ నిర్వహణను పరిశీలించారు.

తనిఖీల్లో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎన్.గిరీష్ కుమార్ ఎంవీఐ లేకుండానే డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తూ, వాహనాల రిజిస్ట్రేషన్ తనిఖీలు చేస్తున్నట్లు గుర్తించారు. అధికారిక పనులు చేయించేందుకు ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రజల దరఖాస్తుల విషయంలో ఏజెంట్లుకార్యాలయంలోకి స్వేచ్ఛగా వచ్చి సంబంధిత సిబ్బందితో వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అలాగే రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, సిబ్బంది విధులపై పర్యవేక్షణ లోపించడం, డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ప్రదేశం రవాణా శాఖ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం, డ్రైవింగ్ ట్రాక్లో సూచిక బోర్డులు లేకపోవడం వంటి లోపాలను ఏసీబీ అధికారులు గుర్తించారు

ఈ లోపాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని, తదుపరి చర్యల కోసం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ఏసీపీ డిఎస్పి మహేందర్ రెడ్డి సిఐలు తిరుపతి ప్రేమ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular