మెట్ పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): కోరుట్ల తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఇంచార్జి, నాయకులు డాక్టర్ రఘు తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.వారి వెంట జగిత్యాల పట్టణ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, లింగంపల్లి సంజీవ్, రెండ్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

