Monday, November 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనవదుర్గ శరన్నవరాత్రి  ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

నవదుర్గ శరన్నవరాత్రి  ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

బోనాలు, అన్నదానం, కుంకుమార్చనలతో దుర్గాదేవి వేడుకలు

మల్లాపూర్, అక్టోబర్ 7 (నవగీతం): 

మల్లాపూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల కరపత్రాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. నవదుర్గ సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకుల సమక్షంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14న హనుమాన్ దేవాలయం నుంచి నవదుర్గ దేవి మండపం వరకు భక్తులతో మహా బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్టోబర్ 15న భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేయగా, అక్టోబర్ 16న మహిళలచే భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 19న సాయంత్రం 7:30 గంటలకు నంది విగ్రహం వద్ద ప్రతిష్టాత్మకంగా మహిషాసుర సంహారం ఘట్టాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని నవదుర్గ సేవా ఉత్సవ సమితి సభ్యులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular