Monday, November 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహైవే బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణపై క్షేత్రస్థాయిలో పరిశీలన

హైవే బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణపై క్షేత్రస్థాయిలో పరిశీలన

📰 Generate e-Paper Clip

రైతులతో మాట్లాడి భూముల వివరాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్

జగిత్యాల, అక్టోబర్7,(నవగీతం)

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో హైవే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియపై అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి. మధుసూదన్, బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

హైవే బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన భూములను అధికారులు పరిశీలించి, భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడారు. ఆయా భూముల వివరాలు, భూసేకరణ వల్ల కలిగే ప్రభావం, రైతుల అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.

భూముల పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న రికార్డులు, భూముల పరిస్థితిని పరిశీలించి, హైవే బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు.

ఈ పరిశీలనలో మండల రెవెన్యూ అధికారి శేఖర్, రెవెన్యూ అధికారులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular