జగిత్యాల, ఆగస్టు18,(నవగీతం):జగిత్యాల జిల్లాలోని ధరూర్ క్యాంప్‌లో నూతన ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణం కోసం మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ భూ స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలం, అందుబాటులో ఉన్న విస్తీర్ణం, మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు, అవసరమైన చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల అర్బన్ తాసిల్దార్ రామ్మోహన్ , హౌసింగ్ డి.ఈ. భాస్కర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


