మల్లాపూర్,ఆగస్టు18(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ముద్ధం శరత్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం మండల అధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్, ముద్ధం సత్యనారాయణ గౌడ్, పెరుమాండ్ల అర్జున్, గొట్టిపడత సత్యం, ఆలాల నరసయ్య, గొట్టిపడత లక్ష్మీరాజం, పెరుమాండ్ల నవీన్, నాగుల నారాయణ, బండి సత్యం, ముద్ధం శ్రీధర్, సతీష్, నవీన్, అజయ్, అనిల్, రవి, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మల్లాపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
0
8
Previous article
Next article

