బుగ్గారం మండల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
బుగ్గారం,అక్టోబర్12,(నవగీతం)
తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తయిన సందర్భంగాబీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుగ్గారం మండల కేంద్రంలో నాయకులు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బుగ్గారం మండల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వీరమల్ల సందీప్, దాసరి పూర్ణచందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలన అందించిన కేసీఆర్, గతంలో ఉన్న 10 జిల్లాలను 33జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారని పేర్కొన్నారు.ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక ప్రత్యేకతలకు అనుగుణంగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారని తెలిపారు.నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, విద్య, వైద్యం, సంక్షేమ సేవలు సులభంగా పొందే అవకాశం ఏర్పడిందని వారు వివరించారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఎదుర్కొన్న దూరభారాన్ని తగ్గించడంలో ఈ పునర్వ్యవస్థీకరణ దోహద పడిందని అన్నారు. బుగ్గారం మండల ఏర్పాటుకు కృషి చేసిన కొప్పుల ఈశ్వర్ సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. మండల ప్రజలకు పాలనా సౌకర్యాలు అందుబాటులోకి రావడంలో ఆయనపాత్రను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాసర్తి రాజిరెడ్డి, అబ్దుల్ రహమాన్, తుదిచెర్ల శంకర్, పొన్నం శంకర్, పొన్నం సత్తన్న, పొల్లంపెల్లి మల్లేశం, పదం సత్తన్న, గంగాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాసర్తి అశోక్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

