మల్లాపూర్ అక్టోబర్ 13,( నవగీతం )
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి)లో పలువురు గ్రామస్థులు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి బబ్బిలి అక్షయ్,రాంపల్లి బాలరాజు, మహాతేజా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న కృషిలో భాగస్వాములమవుతామని పార్టీలో చేరిన వారు తెలిపారు.గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బబ్బిలి అక్షయ్, బాలరాజు , మహాతేజా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ బబ్బిలి అక్షయ్ , రాంపల్లి బాలరాజు , కోరుట్ల అధ్యక్షుడు మహాతేజా ఇతర నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.

