Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రైవేట్ స్కూల్ టాటా ఏసీ వాహనం బోల్తా

ప్రైవేట్ స్కూల్ టాటా ఏసీ వాహనం బోల్తా

📰 Generate e-Paper Clip

ఇద్దరు విద్యార్థులకు గాయాలు

నవగీతం, మల్లాపూర్:

స్కూల్ టాటా ఏసి వాహనం బొల్తా పడిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూలుకు పలు గ్రామాల నుండి రోజు మాదిరిగానే  వాల్గొండ నుండి మల్లాపూర్ కి విద్యార్థులను తీసుకెళ్తుండగా మల్లాపూర్ గ్రామ శివారులో మోడల్ స్కూల్ రోడ్డు దగ్గర స్కూలు టాటా ఏసీ వాహనం అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఈ వాహనంలో ఆ సమయంలో సుమారుగా 15 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా వెంటనే మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ,ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, మాజీ జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సిరిపురం రవీందర్, వార్డు సభ్యులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలి వెళ్లి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అవసరమైతే పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యాధికారిని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular