Tuesday, September 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

మల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

ఇటీవల నూతనంగా ఎన్నికైన మల్లాపూర్ మండల టియూడబ్ల్యూజే (హెచ్ 143) ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను, జగిత్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ ఏఎస్ఐ సామాజిక సేవకుడు రాజేశుని శ్రీనివాస్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ బాధ్యులకు ఆయన శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలో ఎదురయ్యే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. నూతన కార్యవర్గం బాధ్యతాయుతంగా పనిచేస్తూ, జర్నలిజం విలువలను కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి అంజన్న, సెక్రటరీ మోర సతీష్, కోశాధికారి రాజేందర్, సీనియర్ జర్నలిస్టులు చారి, పవన్, ఐజేయు జిల్లా మాజీ ఈసీ మెంబర్ చింతలూరి రంజిత్, ఐజేయు సభ్యులు తోట శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular