Wednesday, August 5, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమార్గదర్శి లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు.

మార్గదర్శి లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు.

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల

జగిత్యాల పట్టణ కేంద్రంలో మార్గదర్శి పాఠశాలలో  ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు తెలుగు సాంస్కృతి అద్దంపట్టేలా వివిధ పల్లెలలో, పట్టణాలలో కుటుంబ సభ్యులు, పిల్లలు ఆనందోత్సవాలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మానపురి సునీత అన్నారు.అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు,గాలి పటాల పోటీలు నిర్వహించారు. పాఠశాల యందు పండుగ వాతావరణం తలపించే విధంగా సంక్రాంతి సంబరాలు మహోత్సవానికి అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీలు నిలోఫర్, శ్రీలత, మాధవి,శ్రీలక్ష్మీ,దివ్య,శిరీష , తల్లిదండ్రులు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular