Tuesday, August 4, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం,చొప్పదండి:

చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF)చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షుల ఎన్నికకై అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, కౌన్సిలర్స్ కొట్టే అశోక్, ముద్ధం తిరుపతి, గుర్రం రాజేందర్ రెడ్డి, పిట్టల వెంకటేష్, సర్పంచులు చొక్కళ్ల తిరుపతి, మాచర్ల జగన్ ,బద్దెన పల్లి సతీష్, పెద్దెల్లి సురేష్, ఉప సర్పంచులు, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, నాయకులు మునిగాల చందు, సుధాకర్ గౌడ్, గుర్రం రమేష్, కడారి శంకర్, మహేశుని మల్లేశం మార్కేట్ కమిటీ డైరెక్టర్లు,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular