Sunday, August 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవేంపల్లిలో బీజేపీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక

వేంపల్లిలో బీజేపీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,ఆగస్టు9,(నవగీతం): మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా నలిమెల ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా గుగ్లావత్ మహేష్లను కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వేంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్,మిట్టపల్లి దివాకర్ రెడ్డి,వేముల నరేష్,గోపినేని రాజేందర్, రాజ్ యాదవ్ వేల్పుల, రాగెల్లి రాజేశం,వెల్మల రాజశేఖర్, జై గణేష్, భుక్య మహేష్తో పాటు వేంపల్లి గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నలిమెల ప్రసాద్, ఉపాధ్యక్షుడు గుగ్లావత్ మహేష్‌ కు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular