Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణగాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి నేతృత్వంలో కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ గౌడ్ తెలిపారు.ఈ వేడుకల్లో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నాయకులను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా వివరించారు. సామాజిక న్యాయం, సెక్యులరిజం వంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ వేడుకల్లో కోరుట్ల కాంగ్రెస్ నాయకులు నత్తి రాము, సుద్దు సురేందర్, మిట్టపల్లి భూమేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, సేవాదళ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular