Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఉచిత గాలిపటాల పంపిణీకి విశేష స్పందన

ఉచిత గాలిపటాల పంపిణీకి విశేష స్పందన

📰 Generate e-Paper Clip

నవగీతం,రుద్రంగి

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు బోయిని రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించి చిన్నారులకు, యువతి యువకులకు ఉచితంగా పతంగులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్ పాల్గొని పంపిణి చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేష్, బోయిని రాజు లు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అంటే మహిళలకు రంగు రంగుల ముగ్గులు, చిన్నారులకు, యువకులకు ఎగురవేసే గాలిపటాలు గుర్తుకు వస్తాయని అన్నారు. చిన్నారులకు మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని పండగ వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఉచితంగా గాలిపటాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. చిన్నారులు పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మంజను వాడకూడదని గుర్తు చేస్తూ దారం కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఇకముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. చిన్నారులకు పతంగులు అందజేసిన బోయిని రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ మీసాల రవీందర్, పెద్ది శ్రావణ్, తాళ్లపెల్లి బాలకిషన్ రావు, శీలం మీనయ్య, మోతె నితిన్, పడాల గజానంద్, రాచకొండ గంగనర్సయ్య, ఉప్పులూటి మహేష్, కంటే నరేష్, అవునూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular