Sunday, March 1, 2026
ads
Homeఖమ్మంజాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా నాగేశ్వరావు

జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా నాగేశ్వరావు

📰 Generate e-Paper Clip

నవగీతం,ఖమ్మం:

మాస్టర్ ఫ్రేమ్ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ అకాడమీ వారు జనవరి 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా మోతుగూడెం లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నందు ముత్యాల నాగేశ్వరరావు జనరల్ విభాగం లో ఉత్తమ బహుమతి అందుకున్నాడు. వైజాగ్ కు చెందిన ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్ అగర్వాల్ పర్యవేక్షణలో మూడురోజుల పాటు జరిగిన ఈ వర్క్ షాప్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 50మంది ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈ వర్కుషాప్ లో జనరల్, ట్రేడిషనల్, గ్లామర్ విభాగలలో కాంపిటిషన్ నిర్వహించగా జనరల్ విభాగంలో నాగేశ్వరరావు గిరిజన జీవనవిధానం పై తీసిన ఫోటో కు ఉత్తమ బహుమతి లభించింది. గతంలో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి లో అనేక సార్లు అవార్డు లు గ్రహించారు నాగేశ్వరరావు కు ఈ అవార్డు రావడం పట్ల స్థానిక ఫోటోగ్రాఫర్స్ హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా ఫోటోగ్రఫీ అధ్యక్షులు వెంకట్, శ్రీను, ప్రసాద్, రవి, ఆర్గనైజర్ జగన్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular