Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుధర్మరక్షణ-లోక కల్యాణార్థం శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షల ఆరంభం

ధర్మరక్షణ-లోక కల్యాణార్థం శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షల ఆరంభం

📰 Generate e-Paper Clip

నవగీతం,నిజామాబాద్

ధర్మ రక్షణకై, లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీ భక్త మార్కండేయ స్వామి మాల ధారణ దీక్షలు శనివారం  రోజున నిజామాబాద్ లోని కోటగల్లీ శ్రీ మార్కండేయ స్వామి మందిరంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి విశేష పూజలు నిర్వహించగా, అఖిల భారత మార్కండేయ స్వామి మాల ధారణ దీక్షల మార్గదర్శకులు గురుస్వామి శ్రీ పద్మకులరత్న చిలుక నర్సప్ప మార్కండేయ ఆధ్వర్యంలో మాల ధారణ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవంతో జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించి, సమాజంలో ధర్మబద్ధమైన జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ పవిత్ర కార్యక్రమంలో పట్టణ (నగర) పద్మశాలి సంఘము కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మొర సాయిలు, ఉపాధ్యక్షులు యెనుగందుల మురళి, దుబ్బా రాజన్న, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు యెనుగందుల సుభాష్, అవదూత రాములు, బుస శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి గంగరాజు, పబ్లిసిటీ సెక్రటరీ బుస శ్రీనివాస్, మందిర కమిటీ చైర్మన్ భీమర్ధి సురేందర్, డైరెక్టర్లు, మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దోర్నాల సంధ్య మరియు సభ్యులు, యువజన సంఘం అధ్యక్షులు ఎర్రగుంట శ్రీనివాస్, సలహాదారు ఎస్.ఆర్. సత్యపాల్, భీమర్ధి రవి.సహా పలువురు పెద్దలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular