నవగీతం, వరంగల్
వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅనంతరం భద్రకాళి దేవాలయ అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ ప్రజలు, హన్మకొండ శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోత్తంగా మరింత వన్నె తెచ్చే విధంగా చేయాలని, మాడ వీధులు, ఆలయ వెడల్పు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు..ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు గోదావరి ఒడ్డున గల ప్రధాన దేవాలయాలన్నింటిని ఒక టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రణాళికలు చేస్తున్నది ప్రభుత్వం.ఇవన్నీ పూర్తయితే దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా మన ప్రభుత్వం చేసే గొప్ప ప్రయత్నాన్ని తలుచుకునేలా రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కమిటీని వేసి డీపిఆర్ తయారు చేసుకుని, డబ్బులు ఎంత ఖర్చైనా దేవాలయాలన్నింటిని ఒకే టూరిజం లైన్ లోకి తీసుకురావాలని ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఇంకా పెండింగ్ ఉన్న పనులను కొద్ది నెలల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి , నాయిని రాజేందర్ రెడ్డి, రేపూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులు, మరియు ఆలయ పూజారులు పాల్గొన్నారు.

