Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి

మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి

📰 Generate e-Paper Clip

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు

నవగీతం,వైరా:

రానున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పట్టణ నాయకురాలు మచ్చా మణి అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. వైరా మున్సిపాలిటీలో జరిగిన అవినీతీకి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో సిపిఎం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటి పన్నులు తగ్గించాలని, అన్ని వార్డులలో డ్రైనేజీ, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు తదితర స్థానిక సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, రాచబంటి బత్తీరన్న, సంక్రాంతి నర్సయ్య, బొంతు సమత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, కామినేని రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular