నవగీతం,నిర్మల్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మాణ పనుల పురోగతి, స్థల సేకరణ, నాణ్యత ప్రమాణాలపై సమీక్షించారు. అదేవిధంగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణ, సరిపడా సిబ్బంది, సామగ్రి సమకూర్చడం, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి బృందాల ఏర్పాటు, ప్రవర్తన నియమావళి అమలు అంశాలపై సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

