Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురేకుర్తి–విద్యానగర్ భూ బాధితుల (ధర్నా ) సమావేశం

రేకుర్తి–విద్యానగర్ భూ బాధితుల (ధర్నా ) సమావేశం

📰 Generate e-Paper Clip

నవగీతం,కరీంనగర్ :

కరీంనగర్ లోని శాతవాహణ యూనివర్సిటీ చౌరస్తా వద్ద రేకుర్తి, విద్యానగర్ భూ బాధితుల ధర్నా సమావేశం ఆదివారం  నిర్వహించారు. రేకుర్తి, శ్రీరామ్‌నగర్ కాలనీ, కొత్త యాస్వాడ, ఆదిత్యానగర్, సాలేనగర్, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన కొంత భాగం పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితా (22–ఏ)లో చేర్చిన నిర్ణయానికి నిరసనగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయిన భూ బాధితులు సుమారు 80 మంది ఈ సమావేశంలో పాల్గొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భూ సమస్యను వెంటనే పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐక్యవేదిక కన్వీనర్ పాశం మోహన్ రెడ్డి, సభ్యులు రాజుగోపాల్ రెడ్డి, వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, పచ్చునూరి నరేందర్, చింతల రవీందర్, గడప శ్రీనివాస్, ఆకుల కృష్ణ, రవి, డాక్టర్ రహీం పాల్గొన్నారు. అలాగే రేకుర్తి  విద్యానగర్‌కు చెందిన భూ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular